రాష్ట్రంలో కూటమి పార్టీలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. మహిళా ప్రజాప్రతినిధులకు రక్షణ కరువైంది. తిరుపతిలో మహిళా మేయర్, ఎంపీ, ఎమ్మెల్సీలు కారులో ఉండగా దాడి చేశారు. కార్పొరేటర్లను బస్సుపై దాడి చేసి ఎత్తుకుపోయారు. ఎస్పీ ఉండగానే ఇంత విధ్వంసం సృష్టించారు. వెంకటేశ్వర స్వామి చూస్తుండగానే ఈ అరాచకానికి పాల్పడ్డారు. మా పార్టీ కార్పొరేటర్లకి భద్రత కావాలని మేము నిన్ననే అడిగాం. పోలీసులు పూర్తిగా టీడీపీ నేతలకు వత్తాసు పలుకుతున్నారు. ఇలాంటి విధ్వంసం ఏనాడు జరగలేదు. ఏమాత్రం సిగ్గు ఉన్న టీడీపీ నేతలు ఇలా వ్యవహరించరు. ప్రజలే కూటమి నాయకులకు తగిన బుద్ధి చెప్పడం ఖాయం’ అంటూ విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి ఘాటు వ్యాఖ్యలు చేశారు.