మున్సిపల్ ఎన్నికల్లో కూటమి నేతల అరాచకాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు వైయస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. తిరుపతి డిప్యూటీ మేయర్, ఇతర ఎన్నికల్లో టీడీపీ, జనసేన అరాచకాలను వైయస్ఆర్‌సీపీ నేతలు దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, మేయర్ భాగ్యలక్ష్మి తదితరులు ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం దేవినేని అవినాష్ మీడియాతో మాట్లాడుతూ..‘తిరుపతిలో టీడీపీ, జనసేన గుండాలు రెచ్చిపోయారు. సిగ్గు లేకుండా కార్పొరేటర్లు, మహిళలపై దాడులు చేశారు. కూటమి ప్రభుత్వం లో దాడులు, దౌర్జన్యం పెరిగాయి. మేము నిన్ననే ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశాం. సిగ్గు లేకుండా కూటమి నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. కార్పొరేటర్లు, కౌన్సిలర్లను బెదిరించి, భయపెట్టి, ప్రలోభ పెట్టి లాక్కుంటున్నారు. అక్రమంగా నిర్వహించిన ఎన్నికలను రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారు.