తిరుపతిలో ఉద్రికత్త చోటుచేసుకుంది. తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికల సందర్భంగా చిత్తూరులో భాస్కర హోటల్‌లో ఉన్న వైయస్ఆర్‌సీపీ కార్పొరేటర్లను కూటమి నేతలు నిర్బంధించారు. హోటల్ బయట కార్లు అడ్డంగా పెట్టి బయటకు వెళ్లకుండా ప్లాన్ చేశారు.తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికల సందర్భంగా ఈరోజు ఉదయం 11 గంటలకు డిప్యూటీ మేయర్ ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో వైయస్ఆర్‌సీపీ కార్పొరేటర్లు రాకుండా కూటమి నేతలు హోటల్‌లో నిర్బంధించారు. కార్పొరేటర్లు బయటకు రాకుండా కూటమి నేతలు కార్లను అడ్డంగా పెట్టారు.
ఈ నేపథ్యంలో కార్పొరేటర్లను విడిపించేందుకు వెళ్లిన వైయస్ఆర్‌సీపీ నేత భూమన అభినయ్ రెడ్డిని కూడా కూటమి నేతలు నిర్బంధించారు.హోటల్ వద్దకు అభినయ్ రెడ్డి వెళ్లడంతో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కుమారుడు ఆరణి మదన్, టీడీపీకి సంబంధించి జేబీ శ్రీనివాసులు, మాజీ టౌన్ చైర్మన్ పులిగోరు మురళీ, క్రిష్ణా యాదవ్ తదితరులు రౌడీలతో ముట్టడించారు. అనంతరం, పోలీసులు అక్కడికి రావడంతో కూటమి వెనక్కి తగ్గారు. దీంతో, భాస్కర హోటల్ నుంచి తిరుపతికు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు, నాయకులు బయలుదేరారు.