నథింగ్ నుంచి మార్చి 4 వ తేదీన కొత్త ఫోన్‌లు లాంచ్ కానున్నాయి. ఇప్పటికే సంస్థ అధికారిక ప్రకటన చేసింది. నథింగ్ ఫోన్ 3a పేరుతో (Nothing Phone 3a Smartphone) విడుదల కానున్నాయని తెలుస్తోంది. ఫోన్ 3a తోపాటు ప్రో మోడల్ కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ సిరీస్‌కు సంబంధించి ఇప్పటికే అనేక లీక్స్ వస్తున్నాయి. అయితే నథింగ్ మాత్రమే అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.
తాజాగా ఓ ఆసక్తికర ఫీచర్ వెలుగులోకి వచ్చింది. ఈ ఫోన్‌లు ఐఫోన్ తరహా ఫీచర్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. కేవలం ఫ్లాగ్‌షిప్ మోడల్స్‌లో ఉండే ఈ ఫీచర్ తొలిసారిగా నథింగ్ ఫోన్‌లోనూ కనిపించనుందని తెలుస్తోంది. నథింగ్ ఫోన్ 3a కెమెరా బటన్‌ను కలిగి ఉంటుందని సమాచారం. ఈ తరహా కెమెరా బటన్ ఐఫోన్ 16 సిరీస్‌లో ఉంది. అయితే ఈ బటన్ యాక్షన్ బటన్ గా పనిచేస్తుందని తెలుస్తోంది. అయితే ఈ యాక్షన్ బటన్‌పై నథింగ్ సంస్థ ఎటువంటి ప్రకటన చేయలేదు. నథింగ్ కొత్త సిరీస్ హ్యాండ్‌సెట్‌లు బ్యాక్ ప్యానల్ వద్ద గ్లిఫ్ లైట్ ఇంటర్ ఫేస్‌తోపాటు LED లైట్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. గత మోడళ్లు కూడా ఇదే తరహా ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉన్నాయి. అయితే భారీ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. నథింగ్ ఫోన్ 3a స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.8 అంగుళాల FHD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు కెమెరా విభాగంలో కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది. ప్రో మోడల్ ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉండే అవకాశం ఉంది. బేస్ వేరియంట్ గత మోడల్ తరహాలోనే డ్యూయల్ కెమెరాలతో అందుబాటులో ఉంటుందని సమాచారం.