కేన్సర్‌తో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని నోడల్ ఆఫీసర్ జగదీష్ చంద్రారెడ్డి సూచిం చారు. ప్రపంచ కేన్సర్ దినం సందర్భంగా మంగళవారం తలముడిపి గ్రామ పీహెచ్‌సీలో, మిడుతూరు కేజీబీవీలో వైద్యాధికారులు ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. వైద్యాధికారులు తిరుపతి, మద్ది లేటి, శారద, సాయిసుధ, సుజాత, పాఠశాల ప్రిన్సిపాల్ విజయలక్ష్మి, వైద్య సిబ్బంది ముర్తుజావలి, సూర్యం, చంద్రకళ, ఆశా వర్కర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.కల్తీ ఆహారమే కేన్సర్‌కు కారణమని శాంతిరాం ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మధుసూదన్ చెట్టి అన్నారు.
ప్రపంచ కేన్సర్ దినం సందర్భంగా మంగళవారం కళాశాలలో కేన్సర్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఫార్మా-డి విద్యార్థులు కేన్సర్ రకాల గురించి వివరించారు. అనంతరం కేన్సర్ లోగోను ప్రదర్శించారు. కార్యక్రమంలో ఫార్మసీ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. అత్యాధునిక వైద్యంతో కేన్సర్‌ను జయించవచ్చని నంద్యాల ఎస్డీపీవో జావలి ఆల్ఫోన్స్ అన్నారు. ప్రపంచ కేన్సర్ దినం పురస్కరించుకొని నంద్యాల ఐఎంఎ, ఉదయానంద హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని ఎస్డీపీవో ప్రారంభించారు. వారు మాట్లాడుతూ కేన్సర్ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించడం ద్వారా నేటి ఆధునిక వైద్యం ద్వారా నయం చేయవచ్చన్నారు. డాక్టర్ రవికృష్ణ, డాక్టర్ భార్గవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.ప్రపంచ కేన్సర్ దినం సందర్భంగా నంద్యాల ఎల్‌కేఆర్ గ్లోబల్ స్కూల్ ఆధ్వర్యంలో పట్టణంలో అవగాహన ర్యాలీని నిర్వహిం చారు. ర్యాలీలో విద్యార్థులు పాల్గొన్నారు.