అల్లర్లు, ఘర్షణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని యాడికి సీఐ వీరన్న హెచ్చరించారు. యాడికి మండలం యంగన్నపల్లి గ్రామంలో గురువారం పోలీసులు ఫుట్ పెట్రోలింగ్, సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఐ వీరన్న మాట్లాడుతూ గ్రామస్థులందరూ కలిసి మెలిసి ప్రశాంతంగా జీవించాలన్నారు. ప్రశాంతతకు భంగం కలిగిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎస్ఐ వెంకటరమణ పాల్గొన్నారు.
![]() |
![]() |