విశాఖ నగరంలోని గోపాలపట్నంలో లక్కీ షాపింగ్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. కొత్తపాలెం ఆదర్శనగర్‌కు చెందిన ఉమ్మి వెంకట బాలాజీ(26) ఇవాళ ఉదయం స్కూటీపై వెళ్తుండగా ఓ ప్రైవేట్ కాలేజ్ బస్సు ఢీ కొట్టింది.
దీంతో బాలాజీ అక్కడికక్కడే మృతిచెందాడు. తన సోదరుడిని స్కూటీపై దించి ఇంటికి తిరిగి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
![]() |
![]() |