బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం భరోసా ఇస్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అద్దంకిలో 56 మందికి రూ.77 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను మంత్రి గొట్టిపాటి రవికుమార్ పంపిణీ చేశారు. జగన్ ఐసీయూలో పెట్టిన ఆరోగ్యశ్రీకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఊపిరి పోసిందని చెప్పారు. జగన్ 1.0కే ప్రజలు బెంబేలెత్తి 11 సీట్లకే పరిమితం చేశారని విమర్శించారు. జగన్ 2.0 ఎంత దారుణంగా ఉంటుందో అని ప్రజలు ఆయనకు ఎదురు దండాలు పెడుతున్నారని అన్నారు. ప్రజలు ఇచ్చిన 11 సీట్లతో అయినా జగన్ రెడ్డి యుద్ధం చేయాలని చెప్పారు. పిరికి వాడిలా అసెంబ్లీలో మైకు ఇవ్వడం లేదని జగన్ కుంటి సాకులు చెబుతున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు.