ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ఎన్నికలు వాయిదా పడతాయా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 04, 2019, 07:52 PM

డేటా చోరీ వివాదం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలకం రేపుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓట్లతో ముడిపడిన ఈ వివాదం ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. ఏపీలో పెద్దసంఖ్యలో ఓట్లను తొలగించే యత్నాలు సాగాయని అటు వైకాపా, ఇటు టీడీపీ ఆరోపించుకుంటున్నాయి కనుక ఈ కేసు కాస్తా వంద కేసులుగా పెచ్చరిల్లే అవకాశముంది. కోర్టుల దాకా వెళ్తే.. ఎన్నికలు కూడా వాయిదా పడే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు.
హైదరాబాద్‌లోని ఐటీ గ్రిడ్ ఆఫ్ ఇండియా, బ్లూఫ్రాగ్, బ్లూవేల్ వంటి సంస్థలకు టీడీపీ ప్రభుత్వం ఏపీ ప్రజల డేటా ఇచ్చిందని, దాని సాయంతో ఓట్లను తొలగిస్తున్నారని వైకాపా ఆరోపించింది. అయితే టీఆర్ఎస్, మోదీ, జగన్ కలసి ఏపీ ప్రజల డేటా లాగేస్తున్నారని, తమకు సాయం చేసే కంపెనీలపై ఐటీ దాడులు చేయిస్తున్నారని టీడీపీ అంటోంది. దీంతో రెండు పక్షాల మధ్య పరస్పర దూషణలు సాగుతున్నాయి. రెండు రాష్ట్రాల పోలీసులు మధ్యా విమర్శలు సాగుతున్నాయి.
రెండువైపులా పదునే-చంద్రబాబు ప్రభుత్వం సంక్షేమ పథకాల పంపిణీ కోసం పల్స్ సర్వే పేరుతో జనం నుంచి వివరాలు సేకరించింది. ఆధార్‌, వేలిముద్రలు, ఆస్తిపాస్తులు, కులం, ఉద్యోగం వంటి అనేక వివరాలు తీసుకున్నారు. ఇది ప్రభుత్వం సేకరించిన సమాచారం కనుక ప్రైవేటు సంస్థలకు ఇవ్వడం నేరం. టీడీపీ కోసం, ఏపీ ప్రభుత్వం కోసం అనేక యాప్‌లు, ఇతర ఐటీ సేవలు అందిస్తున్న కంపెనీలకు ఈ డేటా ఇచ్చారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ వివాదంలో రెండు కోణాలు ఉన్నాయి. ఒకటి ఓట్ల తొలగింపు కుట్ర, రెండో డేటా చౌర్యం. ఈ రెండూ రుజువైతే అటు ఏపీలో ఎన్నికలు వాయిదా పడే అవకాశముంది. టీడీపీ కూడా చిక్కుల్లో పడి రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి రావచ్చు. ఏపీలో ఓట్ల తొలగింపుపై ఇప్పటికే 40కి పైగా కేసులు నమోదయ్యాయి. ఐటీ గ్రిడ్ వ్యవహారం దీనికి తోడు కావడంతో ఏపీ ఓటర్ల జాబితా ఆలస్యమయ్యే అవకాశముంది. ఓట్ల తొలగింపు రుజువైతే.. బాధితులు కోర్టులకు వెళ్లడం ఖాయం. దీంతో జాబితాలను మళ్లీ సవరించాల్సి వస్తుంది. ఈ ప్రక్రియ పోలింగ్ తేదీకి ఒక వారం ముందుగా ముగియపోతే ఎన్నికలకు గండమే.
మరి ఈసీ చూస్తూ ఊరుకుంటుందా?ఎన్నికల సంఘం ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోకపోవచ్చు. ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల తొలగింపు వివాదం తెలిసిందే. లక్షల ఓట్లు గల్లంతయ్యాయని కాంగ్రెస్ కోర్టుకెక్కింది. ఈసీ, కోర్టులు సకాలంలో స్పదించడంతో ఓటర్ల జాబితా మార్పుచేర్పులతో త్వరగానే సిద్ధమైంది. అయితే షెడ్యూలు ప్రకారం ఎన్నికలు జరిపి తీరాల్సిందేనని కేంద్రం, ఈసీ పట్టుబడితే.. ఈ కేసులపై పార్టీలు ఎంత రచ్చ చేసినా పోలింగ్ యథావిధిగా సాగిపోవడం ఖాయం.


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa