ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సాఫ్ట్​వేర్​ ఉద్యోగి దారుణ హత్య!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 11, 2025, 10:27 AM

AP: విజయనగరం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తెర్లాం మండలం నెమలాంలో సాఫ్ట్​వేర్​ ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యాడు. కొనాం ప్రసాద్(30) అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి గ్రామ శివారులో పడేశారు. బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ప్రసాద్‌ పనిచేస్తున్నాడు. మూడు రోజుల క్రితమే గ్రామానికి వచ్చాడు. ఘటనా స్థలాన్ని డాగ్‌, బాంబు స్క్వాడ్‌ బృందాలు పరిశీలించాయి. హత్య జరిగిన తీరు, దీనికి గల కారణాలపై వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ప్రేమ వ్యవహారం ఏమైనా ఉందా? ఈ ఘటనకు అదే కారణమా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com