నులిపురుగుల నివారణతోనే ఆరోగ్యంగా ఉంటారని డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ సత్యవతి పేర్కొన్నారు. సోమవారం జాతీయ నులిపురుగుల నివారణ దినం సందర్భంగా ఆదోని మున్సిపల్ పాఠశాల విద్యార్థులకు మున్సిపల్ కమిషనర్ కృష్ణతో కలిసి డాక్టర్ సత్యవతి ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. ఏడాది పిల్లల నుంచి 19 ఏళ్ల వరకు ప్రతి ఒక్కరు ఆరు నెలలకు ఒకసారి ఆల్బెండజల్ మాత్రలను వేసుకోవాలని కోరారు. హెచ్‌ఎం మల్లికార్జున, డాక్టర్ వినోద్, సూపర్వైజర్ ఇందిరా దోరతి పాల్గొన్నారు. ఆస్పరి, వెల్దుర్తి, దేవనకొండ, మద్దికెర ప్రాంతాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
![]() |
![]() |