విజయనగరం జిల్లాలోని పూసపాటిరేగ పోలీస్‌స్టేషన్ పరిధిలో 2024లో నమోదైన పోక్సో కేసులో మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనపు హరీష్‌కు పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయాధికారి కె.నాగ మణి ఏడేళ్ల కఠిన కారగార శిక్షతో పాటు రూ. 3 వేల జరిమాన విధిస్తూ సోమ వారం తీర్పు వెలువరించారని ఎస్పీ వకూల్ జిందాల్ ఓ ప్రకటనలో తెలిపారు. హరీష్ అదే గ్రామానికి చెందిన ఐదేళ్ల బాలికపై 2024 నవంబరు 11న లైంగిక దాడికి పాల్పడినట్లు బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ దుర్గాప్రసాద్ కే సు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారన్నారు. 17 రోజుల వ్యవధిలోని అభియోగపత్రాలు న్యాయస్థానంలో దాఖలు చేయడంతో చేసి నిందితుడు జె ౖలు నుంచి విడుదల కాకుండా ప్రాసిక్యూషన్ పూర్తికి భోగాపురం సీఐ రామ కృష్ణ, ఎస్‌ఐ దుర్గాప్రసాద్ చర్యలు చేపట్టారన్నారు. దీంతో హరీష్‌పై నేరారోప ణలు రుజువు కావటంతో ఫోక్స్ కోర్టు ప్రత్యేక న్యాయాధికారి కె.నాగమణి శిక్ష ఖరారు చేశారన్నారు. హరీష్ 2023లో ఇదే తరహా నేరం పాల్పడటంతో ఆ కేసు ఇంకా కొనసాగుతోందన్నారు. ఈ కేసులో దర్యాప్తు అధికారులు, ప్రాసి క్యూ షన్ అధికారులను ఎస్పీ అభినందించారు.