తూర్పుగోదావరి జిల్లా కానూరులో కోళ్లకు బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో స్థానికంగా కలకలం చెలరేగింది. ఉభయ గోదావరి జిల్లాల్లో 50 లక్షల కోళ్లు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బర్డ్ ఫ్లూ కారణంగా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
దీంతో ఆయా జిల్లాల్లో చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. ఆదివారం కేజీ రూ.200-220 ఉంది. అది కాస్త, ప్రస్తుతం రూ.150-170 ధర పలుకుతోంది. ధరలు తగ్గినా కూడా ప్రజలు ఆసక్తి చూపడం లేదు.
![]() |
![]() |