10 ఫార్చ్యూనర్ వాహనాలు కొనుగోలు చేసి వాటిని బుల్లెట్ ప్రూఫ్ గా మార్చాలని ఆదేశాలు ఏపీలోని కూటమి ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 9.2 కోట్లతో 10 కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను సిద్ధం చేసేందుకు సంబంధించి రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం చంద్రబాబుతో పాటు వీఐపీల భద్రత కోసం కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది. 10 టయోటా ఫార్చ్యూనర్ వాహనాలు కొనుగోలు చేసి, వాటిని బుల్లెట్ ప్రూఫ్ గా మార్చాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్రంలో నిత్యం ఎక్కడో అక్కడ... ఎప్పుడో అప్పుడు వీఐపీలు పర్యటిస్తున్నారు. వారికి భద్రత కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అలాగే ప్రభుత్వంలోని పెద్దలు కూడా తరచు వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. వారిని దృష్టిలో పెట్టుకుని తాజాగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక గతంలో ఉన్న వాహనాలకు ఈ కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు అదనం కానున్నాయి.
![]() |
![]() |