శ్రీకాకుళం జిల్లా, సారవకోట మండలంలో ఓ వ్యక్తి పదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్ళితే.... సారవకోట మండలంలోని ఓ గ్రామానికి చెందిన పి.ముకుందరావు అలియాస్ రామారావు అనే వ్యక్తి సోమవారం సాయంత్రం అదే గ్రామానికి చెందిన పదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు కథనం మేరకు.. బాలిక సోమవారం సాయంత్రం పిల్లలతో కలిసి వీధిలో ఆడుకుంటుండగా ముకుందరావు ఆమెను తన ఇంటికి పిలిచాడు. తినుబండారాలు ఇచ్చి లోపలకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక ఏడ్చుకొని తన ఇంటికి వెళ్లి తల్లికి విషయం చెప్పింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ అనిల్‌కుమార్ కేసు నమోదు చేయగా, డీఎస్పీ ప్రసాదరావు దర్యాప్తు చేస్తున్నారు.
![]() |
![]() |