మక్కల్ నిది మయ్యమ్ (ఎమ్ఎన్‌ఎమ్) పార్టీ అధినేత, విశ్వనటుడు కమల్ హాసన్‌ను అధికార డీఏంకే పార్టీ రాజ్యసభకు పంపనుందని తెలుస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం ఎం కె స్టాలిన్.. కేబినెట్‌లోని మంత్రి శేఖర్ బాబు ద్వారా కమల్ హాసన్‌కు సమాచారం పంపినట్లు సమాచారం. ఈ ఏడాది జులైలో డీఏంకే పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు పదవి కాలం పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో కమల్ హాసన్‌ను పెద్దల సభకు పంపేందుకు డీఏంకే సన్నాహాకాలు చేస్తోంది.అయితే గతేడాది మే మాసంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో డీఏంకేతో మక్కల్ నిది మయ్యమ్ పొత్తు పెట్టుకొంది. అయితే ఈ ఎన్నికల్లో కోయంబత్తురు నుంచి కమల్ హాసన్ బరిలో నిలవాలని భావించారు. ఆ క్రమంలో కోయంబత్తురు నియోకవర్గంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కానీ ఈ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై బరిలోకి దిగారు. దీంతో డీఏంకే అధినేత, సీఎం ఎం.కె. స్టాలిన్ సలహా సూచనలతో ఎన్నికల బరి నుంచి పోటీ చేయాలనే ఆలోచనను ఆయన విరమించుకొన్నారు.
![]() |
![]() |