ఏపీలో మద్యం ధరలు పెరిగే సరికి మందుబాబులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధరలు తగ్గిస్తామంటూ పెంచడం ఏంటని ప్రశ్నిస్తూ ప్రభుత్వానికి ఇది ధర్మం కాదని అంటున్నారు. ఈ ప్రభుత్వం కన్నా గత ప్రభుత్వం మేలని.. ధరలు మెల్లిమెల్లిగా పెంచుకుంటూ పోతే ఎలా తాగి బతకగలమని మందుబాబులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మద్యం విక్రయ కేంద్రాల దగ్గర మందుబాబుల ఆవేదన ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. మద్యం ధరలు పెరిగే సరికి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు మందుబాబులు. మద్యం ధరల విషయంలో ప్రభుత్వం మరోసారి ఆలోచించాలని మద్యం ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.