వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ నేపథ్యంలో విజయవాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. దళితుడ్ని కిడ్నాప్ చేసి బెదిరించారనే కేసులో పటమట పోలీసులు మంగళవారం వంశీని హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. గచ్చిబౌలి నుంచి విజయవాడకు తీసుకొచ్చారు. వైసీపీ నేత అరెస్ట్‌తో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు పేర్నినానిని హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు పటమట పోలీస్ స్టేషన్ దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. నందిగామ దగ్గర వంశీ భార్య కారును కూడా అడ్డుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే వంశీ అరెస్ట్‌పై టీడీపీ నేతలు అనేక ఆరోపణలు చేస్తున్నారు. తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడాల్సిందే అంటూ టీడీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు చెప్పారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వంశీ చేసిన అరాచకాలు మర్చిపోతే ఎలా అంటూ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు.
![]() |
![]() |