ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు లోకల్ 18 ద్వారా జిల్లా ఉపాధి అధికారి జి. పద్మజ తీపి కబురు చెప్పారు. రోజుకు రూ.700 పైచిలుకు ఉపాధి పొందే అవకాశం ఉందని తెలిపారు. జాబ్ వరిస్తే భవిష్యత్తుకు ప్రముఖ కంపెనీలు భరోసాగా నిలుస్తాయన్నారు.ప్రముఖ సంస్థలలో ఉద్యోగాల భర్తీ కొరకు జిల్లా ఉపాధి కార్యాలయం, చిత్తూరు నందు ఈ నెల 14న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నామని లోకల్ 18 ద్వారా జిల్లా ఉపాధి అధికారి జి. పద్మజ తెలిపారు. ఉద్యోగ మేళాలో మొత్తం మూడు (03) ప్రముఖ బి ఎస్ ఎస్ మైక్రో ఫైనాన్స్, కోటాక్ (గ్రూప్), మెడ్ ప్లస్, కె వి ఆర్ జ్యువెలరీస్ సంస్థల ప్రతినిధులు పాల్గొంటున్నారని ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
![]() |
![]() |