గోదావరి జిల్లాలను బర్డ్ ఫ్లూ కుదిపేస్తుంది. ప్రస్తుతం జిల్లాలో ఎక్కడ చూసినా ఇదే చర్చ జోరుగా సాగుతుంది. ఇప్పటికే గోదావరి జిల్లాలో లక్షలాదిగా కోళ్లు మృత్యువాత పడినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ముందస్తుగా అనుమానం ఉన్న ప్రాంతాలలో అధికారులు పర్యటించి అక్కడున్న కోళ్లను స్వాధీనం చేసుకుని వాటిని పాతి పెడుతున్నారు. మరికొన్ని చోట్ల పూర్తిస్థాయిలో అమ్మకాలు సైతం నిలిపివేశారు.
తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ఈ పరిస్థితి తాజాగా కోనసీమ జిల్లా సైతం పాకిరిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా కోళ్లతో పాటు చేపలకు కూడా ఈ బర్డ్ ఫ్లూ వస్తుందంటున్నారు. దానికి కారణాలు ఇవే.గోదావరి జిల్లాలో లక్షలాదిగా కోళ్లు వైరస్ ద్వారా మృత్యువాత పడుతున్న విషయం విదితమే.. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కోళ్లు తినేందుకు ప్రజలంతా కూడా దూరంగా ఉంటున్నారు. అనుమానం ఉన్నచోట రెడ్ అలర్ట్ సైతం అధికారులు ప్రకటించారు. అయితే తాజాగా గోదావరి జిల్లాలో చేపల చెరువుల పైన ఈ చికెన్ కోళ్ల వ్యర్థాలు భారీగా కనిపించాయి. దీంతో చనిపోయిన కోళ్లను చేపలకు వ్యర్థాలుగా వేస్తున్నారా అన్న అనుమానం జిల్లాలో లేవనెత్తుతుంది.
![]() |
![]() |