విశాఖలోని ఆర్కే బీచ్‌లో ఓ ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిల్ కావడంతో బీచ్ రోడ్డులోని డివైడర్‌ను ఢీకొట్టి చిల్డ్రన్ పార్కులోకి దూసుకెళ్లింది. సమయంలో అక్కడ వాకర్స్ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ , క్లీనర్ , మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలో లారీ బ్రేక్ ఫెయిల్ కారణంగా ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. గతంలో ఇదే ప్రాంతంలో రెండు సార్లు ప్రమాదాలు జరిగినట్లు సమాచారం.
![]() |
![]() |