సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ ట్రాఫిక్ సీఐ మురళి, సిబ్బందితో గత కొన్ని రోజుల క్రితం గజ్వేల్ పట్టణంలో పిడిచెడ్ రోడ్, క్యాసారం ఎక్స్ రోడ్, తూప్రాన్ రోడ్, ముట్రాజ్ పల్లి రోడ్డు, సంగాపూర్ రోడ్, మరియు ఔటర్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాలలో వాహనాలు తనిఖీ చేయగా, 21, మంది వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు నడుపుతుండగా పట్టుకొని బ్రీత్ ఎనలైజర్ తో తనిఖీ చేయగా మద్యం సేవించి ఉన్నారని రిపోర్టు రాగా మంగళవారం గజ్వేల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ప్రియాంక ముందు హాజరుపరచగా విచారణ చేసి 21 మందికి 15,వేల రూపాయల జరిమాన, ఒక వ్యక్తికి మూడు రోజుల జైలు శిక్ష విధించారు
జైలు శిక్ష పడిన వారి వివరాలు
అమర్ జిత్ తండ్రి శిటల్, రాష్ట్రం ఉత్తరప్రదేశ్, ప్రస్తుత నివాసం గజ్వేల్ పట్టణం. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ మురళి మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడవదని, మరియు రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించే వాహనాలు నడపాలని, రోడ్డు ప్రమాదాల నివారణ గురించి మాత్రమే ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందన్నారు.
![]() |
![]() |