ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న నర్సింగ్ సిబ్బంది సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ను కోరారు. ఏపీ గవర్నమెంట్ నర్సెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఒంగోలు ఏడుగుండ్లపాడులో మంత్రి సత్యకుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. పబ్లిక్ హెల్త్ స్టాండర్స్ సూచనల మేరకు 24 గంటలు పనిచేసే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నాల్గవ స్టాప్ నర్సులను నియమించాలని కోరారు. కాంట్రాక్టుపై పనిచేస్తున్న నర్సింగ్ సిబ్బందిని రెగ్యులర్ చేయడంతో పాటు ఉద్యోగోన్నతుల ప్రక్రియను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మోపిదేవి ఉదయలక్ష్మి, కార్యదర్శి కొత్తపల్లి మంజేష్, కార్యవర్గ సభ్యులు జానీబాషా, మహేష్, మహబూబ్, బీవీ.రామలక్ష్మి, నాగరాజకుమారి, రమణనాయక్, సుమన్, చినకనయ్య, స్మిత, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |