మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ భరోసా ఇచ్చారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం పరిమితిని 25% నుంచి 75% వరకు పెంచుతామని ఆయన హామీ ఇచ్చారు.
క్వింటా మిర్చి ధరను రూ.11,600 పెంచాలన్న డిమాండ్‌పై సానుకూలంగా స్పందించారు. సాగు వ్యయాన్ని పెంచాలని ఐకార్ అధికారులకు ఆయన ఆదేశాలిచ్చారు. మార్కెట్ రేటుకు, రైతులకు సాగు ఖర్చుకు మధ్య ఉన్న తేడాను కేంద్రం చెల్లిస్తుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa