కంపెనీకి సంబంధించిన సమాచారాన్ని లీక్ చేసిన ఇరవై మంది ఉద్యోగులను ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా తొలగించింది. ఈ ఇరవై మంది ఉద్యోగులు సంస్థకు సంబంధించిన రహస్య సమాచారాన్ని లీక్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏ ఉద్దేశంతో సమాచారాన్ని లీక్ చేసినా అది కంపెనీ విధానాలకు విరుద్ధమని మెటా సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు.ఇటీవల కంపెనీలో దర్యాఫ్తును చేపట్టామని, దాంట్లో 20 మంది ఉద్యోగులు దోషులుగా తేలారని, వారు కంపెనీకి సంబంధించిన రహస్య సమాచారాన్ని బయటకు చేరవేస్తున్నట్లు తెలిసిందని ఆ ప్రతినిధి పేర్కొన్నారు.ఈ అంశానికి సంబంధించి త్వరలో మరికొంతమంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. సంస్థకు సంబంధించిన సమాచారాన్ని లీక్ చేసిన అంశాన్ని తాము సీరియస్‌గా తీసుకున్నామని, లీకులు జరిగినట్లు గుర్తిస్తే ఇలాంటి కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa