ఇటీవలి కాలంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఫైటర్ జెట్లు కూలిపోతున్న ఘటనలు పెరిగిపోతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా హర్యానాలోని పంచకుల జిల్లాలో భారత వైమానిక దళానికి చెందిన ఫైటర్ జెట్ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో పైలట్ ప్రాణాలతో బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. శిక్షణలో భాగంగా అంబాలా ఎయిర్ బేస్ నుంచి యుద్ధ విమానం గాల్లోకి ఎగిరిన కొద్ది సేపటి తర్వాత ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే పైలట్ పారాచూట్ సహాయంతో బయటికి దూకేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఇక ఆ యుద్ధ విమానం కూలిన విషయం తెలిసిన స్థానికులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అక్కడికి చేరుకున్నారు. ఈ విషయాన్ని వైమానిక దళ ఉన్నతాధికారులకు అందించారు. మోర్నీ కొండ ప్రాంతాల్లోని బాల్డ్వాలా గ్రామానికి సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ జాగ్వార్ ఫైటర్ జెట్ కూలిన ఘటనపై ఐఏఎఫ్ ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. ప్రమాదం జరగడానికి గల కారణాలను విశ్లేషించనున్నారు. ఈ ఘటనపై ఐఏఎఫ్ అధికారులు ఎక్స్ వేదికగా స్పందించారు. ఇది ఒక ఊహించని ఘటన అని.. టెక్నికల్ సమస్య కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఫైటర్ జెట్‌లో నుంచి పైలట్ సురక్షితంగా బయటికి వచ్చినట్లు వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa