ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంట్లోనే ఉండి బరువు తగ్గించే వర్కౌట్స్, రోజుకి 10 నిమిషాలు చాలు

Life style |  Suryaa Desk  | Published : Fri, Mar 07, 2025, 10:23 PM

ఎక్సర్‌సైజ్ చేసేందుకు జిమ్‌కి వెళ్లడం, గంటలు గంటలు కేటాయించడం మన వల్ల అయ్యే పని కాదని చాలా మంది అనుకుంటారు. అలా అని ఏం చేయలేకపోతున్నామని బాధపడతారు. అలాంటి వారు వారికున్న బిజీ షెడ్యూల్‌‌లోనే ఇంట్లోనే కొన్ని వర్కౌట్స్ చేయొచ్చు. దీనికోసం గంటలు గంటల టైమ్ అవసరం లేదు. అదే విధంగా, జిమ్‌కి వెళ్లాల్సిన పని కూడా లేదు. ఇంట్లోనే హ్యాపీగా ఎక్సర్‌సైజెస్ చేయొచ్చు. అవి కూడా కూడా జిమ్‌‌కి వెళ్లి చేసినంత బెనిఫిట్స్‌ని ఇస్తాయి.


ప్లాంక్


ఇక ప్లాంక్ కూడా మంచి ఎక్సర్‌సైజ్ ప్లాంక్ పొజిషన్‌లో బాడీని ఎంత వీలైతే అంత టైమ్ వరకూ ఉంచాలి. ఇది చేసినప్పుడు బ్యాక్ స్ట్రెయిట్‌గా ఉంచాలి. ఆబ్స్ ఎంగేజ్ అవుతాయి. స్టేబిలిటీ, పోశ్చర్ మెరుగ్గా మారుతుంది. దీంతో కేలరీలు కూడా బర్న్ అవుతాయి. త్వరగా బరువు తగ్గుతారు.


పుషప్స్


ఈ వర్కౌట్స్ కూడా భుజాలు, చెస్ట్, కోర్ కండరాలను బలంగా చేస్తాయి. దీనికోసం ప్లాంక్ పొజిషన్‌లో ఉండాలి. దీంతో బాడీని పైకి లేపి కాసేపు ఉండి తిరిగి నేలపైకి రావాలి. మళ్లీ రిపీట్ చేయాలి. ఇలా చేయగలిగినంతసేపు చేయాలి.


​పుషప్స్ చేయడం వల్ల కండరాలు, భుజాలు, పొత్తి కడుపు కండరాలు బలంగా మారతాయి.


వీటి వల్ల బలం, ఫిట్‌నెస్, పనితీరు మెరుగవుతుంది.


పుషప్స్ చేస్తే కేలరీలు తగ్గుతాయి.


కోర్ స్ట్రెంథ్ పెరుగుతుంది.


అప్పర్ బాడీ బలంగా మారుతుంది.


స్క్వాట్స్


ఈ వర్కౌట్ కూడా ఇంట్లోనే చేయొచ్చు. దీని వల్ల కాళ్లు, తొడలకు బలం పెరుగుతుంది. దీనికోసం


పాదాలని కాస్తా వెడల్పుగా ఉంచాలి. కాలి వేళ్లని పక్కకకి ఉంచండి. మీ కోర్‌ భాగాన్ని బిగించండి. ఇప్పుడు మోకాళ్లని వంచి తుంటిని వెనక్కి నెట్టి కుర్చిలో కూర్చున్నట్లుగా ఉంచడి లేచి నిలబడండి. ఈ స్క్వాట్స్ చేయడం వల్ల హామ్ స్ట్రింగ్స్, గ్లూట్స్ బలంగా మారతాయి. కండరాలు టోన్ అవుతాయి. మొత్తం లోయర్ బాడీ హెల్దీగా మారుతుంది. పనితీరు సరిగా ఉంటుంది. కోర్ బలంస్క్వాట్స్ చేస్తే కడుపు, లోయర్ బయాక్ కండరాలు సరిగ్గా హెల్దీగా మారతాయి. కండరాలు బలంగా మారతాయి. కేలరీలు కరిగి కొలెస్ట్రాల్ కరుగుతుంది. మెటబాలిజం పెరుగుతుంది.


జంపింగ్ జాక్స్


ఇది చేసే ముందు వార్మప్ చేయాలి. దీనిని చేయడం వల్ల చాలా లాభాలు ఉంటాయి. భుజాలు, చేతుల్ని వెడల్పుగా పెట్టి జంప్ చేసి స్టార్ట్ అయిన ప్లేస్‌కి వస్తారు. దీనిని రెగ్యులర్‌గా చేస్తే కేలరీలు బర్న్ అవుతాయి. త్వరగా బరువు తగ్గుతారు. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీంతో పాటు గుండె ఆరోగ్యంగా కూడా ఉంటుంది.


దీనికోసం పాదాలను కలిపి చేతులని పక్కలకి ఉంచాలి.


మీ చేతులని తలపైకి పెట్టి పాదాలని విస్తరించి దూకాలి. తిరిగి యథాస్థానానికి రావాలి.


ఇది చేసేటప్పుడు మోకాళ్లని కొద్దిగా వంచి పాదాల బంతులపై మెల్లగా ఉంచండి. మీ కోర్, పిరుదులని ఇన్వాల్వ్ చేయండి. మోకాళ్లని తుంటి, పాదాలను అనుగుణంగా ఉంచండి. వర్కౌట్ చేసేటప్పుడు చేతులని వెడల్పుగా ఉంచి చేతులని వదులుగా ఉంచండి.


ఈ వర్కౌట్ చేయడం వల్లో ఫిట్‌గా ఉంటారు. బాడీ బలంగా మారుతుంది. రెస్ట్ దొరుకుతుంది. కండరాలు ఫ్లెక్సిబుల్‌గా మారతాయి. జీవక్రియ పెరుగుతుంది. బరువు తగ్గుతారు.


హై నీ


ఇది ఓ రకంగా చెప్పాలంటే ఉన్నచోటే రన్నింగ్ చేయడం లాంటి. దీని వల్ల కోర్ ఎంగేజ్ అవుతుంది. ఎండ్యూరెన్స్ పెరుగుతుంది. రన్నింగ్ చేయడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో ఇంచుమించు అన్నీ లాభాలు ఈ హై నీ ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల కలుగుతాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa