ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉచిత బస్సు సేవలు ప్రారంభించిన మంత్రి లోకేశ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 10, 2025, 07:56 PM

 మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉచిత ఎలక్ట్రికల్ బస్సు సేవలు ప్రారంభమయ్యాయి. ఈ సేవలను మంత్రి నారా లోకేశ్ ఉండవల్లి నివాసంలో నేడు జెండా ఊపి ప్రారంభించారు. ఎయిమ్స్ హాస్పిటల్, పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఈ ఉచిత విద్యుత్ బస్సు సర్వీసులు నడువనున్నాయి. ఎయిమ్స్ కు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు .. పానకాలస్వామి ఆలయానికి ఉదయం 7 నుంచి రాత్రి 8 వరకు ఉచిత విద్యుత్ బస్సును నడపనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa