ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు వైసీపీ ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 11, 2025, 09:15 AM

వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ పిలుపు మేర‌కు విద్యార్థులకు ప్ర‌భుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ బ‌కాయిల విడుద‌ల‌, నిరుద్యోగ భృతి చెల్లించాల‌ని డిమాండ్ పై రేపు (ఈనెల 12న) రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అని వైసీపీనేతలు తెలిపారు. వారు మాట్లాడుతూ.... రాష్ట్రంలో పేద, మధ్యతరగతి విద్యార్దులకు తీరని అన్యాయం చేసేలా ప్రభుత్వ మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ నిర్ణ‌యాల‌ను విద్యార్థిలోకం పెద్ద ఎత్తున వ్య‌తిరేకిస్తోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లా క‌లెక్ట‌రేట్ల వ‌ద్దకు విద్యార్థులు, నిరుద్యోగ‌ యువ‌తతో ర్యాలీగా వెళ్లి  నిర‌స‌న కార్యక్ర‌మాలు నిర్వ‌హించిన అనంత‌రం క‌లెక్ట‌ర్ల‌కు విజ్ఞాప‌నప‌త్రాలు ఇవ్వ‌డం జ‌రుగుతుంది. వైయ‌స్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వ‌ర్యంలో జ‌రిగే ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌భుత్వ వ్య‌తిరేక విధానాల‌ను ఎండ‌గ‌ట్ట‌డానికి విద్యార్థులు, యువ‌త భారీగా త‌ర‌లి రావాలి. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి విద్యార్థుల‌కు కష్టాలు మొద‌ల‌య్యాయి. ప్ర‌భుత్వం ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ కోసం నిధులు విడుద‌ల చేయ‌క‌పోవ‌డంతో పేద విద్యార్థులు  చ‌దువులకు దూర‌మ‌వుతున్న ఘ‌ట‌న‌లు రాష్ట్రంలో చోటుచేసుకుంటున్నాయి. విద్యార్థుల జీవితాల‌తో సీఎం చంద్ర‌బాబు చెల‌గాటం ఆడుతున్నారు. ఫీజులు చెల్లించ‌లేద‌నే కార‌ణంతో కాలేజీ యాజ‌మాన్యాలు కూడా విద్యార్థులకు స‌ర్టిఫికెట్లు, హాల్ టికెట్లు ఇవ్వ‌కుండా వేధిస్తున్నాయి.  9 నెల‌ల్లోనే ప్ర‌కాశం జిల్లాలో ఒక విద్యార్థి ఫీజులు క‌ట్ట‌లేక కూలి ప‌నులకు పోతున్నాడనే విష‌యం అన్ని ప‌త్రిక‌ల్లో వ‌చ్చింది. విజ‌య‌వాడ చైత‌న్య గోశాల క్యాంపస్ వ‌ద్ద ఫీజు క‌ట్ట‌లేద‌ని ఒక విద్యార్థిని గేట్ల బయట నిలబెట్టారు. అనంత‌పురంలో చ‌రణ్ అనే విద్యార్థిని ఫీజులు కట్టలేదని అవమానించడంతో  ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. రాష్ట్ర‌వ్యాప్తంగా ఇలాంటి ఘ‌ట‌న‌లే జ‌రుగుతున్నా సీఎం చంద్ర‌బాబు నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. రూ. 3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామ‌ని ఎన్నిక‌ల్లో చెప్పి అధికారంలోకి వచ్చాక ప‌థ‌కం కోసం బ‌డ్జెట్‌లో రూపాయి కూడా కేటాయించ‌కుండా ప్ర‌భుత్వం నిరుద్యోగుల‌ను వంచించింది. గ్రూప్- 2 ప‌రీక్షను సైతం వివాదాల్లోకి నెట్టేసి నిరుద్యోగుల‌ను బాధిస్తోంది. గ‌త వైయ‌స్ఆర్‌సీపీ పాల‌న‌లో రూ. 8,500 కోట్ల‌తో ఐదేళ్ల‌లో 17 మెడిక‌ల్ కాలేజీలు ప్రారంభింగా, 5 కాలేజీల‌ను పూర్తి చేసి అడ్మిష‌న్లు కూడా జ‌రుగుతున్నాయి. కానీ కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక మిగిలిన కాలేజీలను పూర్తి చేసి అడ్మిష‌న్లు ఇవ్వక‌పోగా మెడిక‌ల్ సీట్లు వ‌ద్ద‌ని  ఐఎంఏకి లేఖ మెడిసన్ చేయాల‌న్న పేద విద్యార్థుల ఆశ‌ల‌ను వ‌మ్ము చేశారు అని అన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa