రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యున్నత యూనివర్సిటీలను, విద్యాసంస్థలను తీసుకొస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గత ఐదేళ్ల పాటు రాష్ట్రం ఎన్నో సమస్యలను ఎదుర్కొందని, అమరావతి నిర్మాణాలను కొనసాగించి ఉంటే ఈ ప్రాంత రూపురేఖలు, పరిస్థితులు మారిపోయేవని అన్నారు. రాజధానిలో త్వరలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణ పనులను ప్రారంభిస్తామన్నారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో మంగళవారం పాపులేషన్ డైనమిక్స్ అండ్ డెవలప్‌మెంట్ వర్క్‌షాప్ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం చంద్రబాబు తొలుత యూనివర్సిటీలో రూ.700 కోట్ల భవనాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం సభలో విద్యార్థులు, మేధావులు అడిగిన పలు ప్రశ్నలకు సీఎం సమాధానం ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa