‘‘రూపాయి సింబల్‘₹’ అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపు పొందింది.. ప్రపంచ ఆర్థిక వ్యవహారాల్లో దేశానికి చిహ్నంగా నిలుస్తోంది. మరోవైపు, యూపీఐ సేవలను అంతర్జాతీయం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతోన్న తరుణంలో సొంత కరెన్సీ చిహ్నాన్ని మనం బలహీనపరుస్తున్నామా?... ఎన్నికైన ప్రజా ప్రతినిధులు, అధికారులు దేశ సార్వభౌమాధికారం, సమగ్రతను కాపాడుతామని రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేస్తారు... కానీ ‘₹’ వంటి జాతీయ చిహ్నాన్ని తొలగించడం ఆ ప్రమాణానికే విరుద్ధం.. ఇది జాతీయ ఐక్యత పట్ల నిబద్ధతను దెబ్బతీస్తుంది.. డీఎంకే చర్యలు.. దేశ ఐక్యతను దెబ్బతీసేలా ఉన్నాయి.. ప్రాంతీయ అస్థిత్వం పేరుతో వేర్పాటువాద భావాలను ప్రోత్సహించే ప్రమాదకరమైన మనస్తత్వాన్ని సూచిస్తున్నాయి.. భాష, ప్రాంతీయ దురభిమానానికి ఉదాహరణ’’ అని నిర్మలమ్మ తీవ్రంగా స్పందించారు.
జాతీయ విద్యా విధానం, హిందీపై కేంద్రం, తమిళనాడు ప్రభుత్వం మధ్య కొద్ది రోజులుగా వివాదం నెలకున్న వేళ.. రూపాయి సింబల్‌ను డీఎంకే సర్కారు తొలగించడం గమనార్హం. కాగా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యావిధానం ఉన్నత విద్యా ప్రమాణాలను పెంచేది కాదని, పూర్తిగా కాషాయ విద్యావిధానమని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు. కాషాయ విద్యా విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తమిళనాడులో అమలు చేసే ప్రసక్తే లేదని స్టాలిన్ పునరుద్ఘాటించారు.
![]() |
![]() |