జగనన్న వదలిన బాణాన్ని అంటూ.. తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను తెచ్చుకున్న షర్మిల కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గంలో పోటీ చేయబోతున్నారు. జిల్లాలో నెలకొన్ని తాజా రాజకీయ పరిస్థితులను వైసీపీ తనకు అనుకూలంగా మలచుకునేందుకు షర్మిలను అక్కడ నిలపాలని భావిస్తున్నట్లుగా ఊహాగానాలు మొదలయ్యాయి. దీనిపై క్షేత్రస్థాయిలో ఒకటీ రెండుసార్లు సర్వేలు నిర్వహించి బలాబలాలు అంచనా వేయాలని వైసీపీ భావిస్తుందట. గత ఎన్నికలకు ముందు అక్రమాస్తుల కేసులో జగన్ జైలుకెళ్లారు. ఓదార్పు యాత్ర మధ్యలో అన్న జైలుకు వెళ్లటంతో.. షర్మిల ఆబాధ్యతలను భుజాన కెత్తుకున్నారు. ఓదార్పు యాత్రను పూర్తిచేసేందుకు వేలాది కీలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఆ సమయంలో ఆమె స్పందించిన తీరు.. ప్రజలతో మమేకం కావటం వంటి అంశాలు వైసీపీకు కొత్త ఊపిరిని చ్చాయి. అన్నను మించి చెల్లెలుగా పార్టీ శ్రేణుల్లో కూడా పాపులారీటీ సంపాదించారు. జగన్ జైలుకే పరిమితమైతే.. చెల్లెలను సీఎం అభ్యర్ధిగా దింపుతారనే ప్రచారం కూడా జరిగింది. సినీ నటుడు ప్రభాస్‌తో షర్మిలకు అనైతిక బంధాలు అంటకడుతూ సామాజిక మాధ్యమాల్లో సాగిన విష ప్రచారంపై ఆమె ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కారకులను గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు. కేవలం పాపులారిటీ కోసమే తాను ఇలా చేసినట్లు నిందితుడు చెప్పటం విశేషం. గత ఎన్నికల్లో మాత్రం ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించలేకపోయారు. జగన్ తల్లి విజయమ్మను విశాఖపట్టణం నుంచి ఎంపీగా నిలిపినా ఓటమి తప్పలేదు. దీంతో చెల్లెలకు ఇటువంటి చేదు అనుభవం ఎదురవకుండా గెలిచే చోట నుంచే బరిలోకి దింపాలనేది జగన్ ఆలోచనగా తెలుస్తోంది. కడప, విశాఖపట్టణం, కర్నూలు, గుంటూరు ఇలా కీలకమైన పార్లమెంటు స్థానాలను పరిగణలోకి తీసుకున్నారు. కర్నూలు, నంధ్యాల పార్లమెంటు స్థానాలను 2014లో వైసీపీ గెలుచుకుంది. అనంతరం ఆ ఇద్దరు ఎంపీలు సైకిల్ ఎక్కటంతో అక్కడ వైసీపీ ప్రాతినిధ్యం మాయమైంది. అందుకే ఈ సారి కర్నూలు నుంచి షర్మిలను రంగంలోకి నిలపటం ద్వారా జిల్లా వ్యాప్తంగా శ్రేణుల్లో ఉత్సాహం.. ఓటర్లలో వైఎస్ కుమార్తెగా సానుభూతి ఉంటుందనేది వైసీపీ ఆలోచన. కడప, అనంతపురం జిల్లాలపై కూడా ఈ ప్రభావం పడుతుందని వైసీపీ శ్రేణులు విశ్లేషించుకుంటున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa