ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉత్తరాంధ్ర నుంచి బాబు ప్రచారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 10, 2019, 09:34 PM

ఎన్నికల షెడ్యూలు ప్రకటించడంతో టీడీపీ కార్యాచరణ సన్నాహాలు మొదలు పెట్టింది. ఉత్తరాంధ్ర నుంచి ప్రచారం శ్రీకారం చుట్టాలనే యోచనలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉన్నారు. శ్రీకాకుళం సన్నాహక సమావేశం తరువాత 4 రోజుల్లో 13 జిల్లాల్లో సన్నాహాక సమావేశాలు వరుసగా నిర్వహించనున్నారు. సన్నాహక సమావేశాల అనంతరం రోడ్డు షోలు, బహిరంగ సభలు, సమావేశాలకు నిర్వహించనున్నారు. ఇందుకోసం కార్యాచరణ సిద్దం చేయాల్సిందిగా చంద్రబాబు ముఖ్య నాయకులను ఆదేశించారు. అసంతృప్తులను బుజ్జగించేందుకు మంత్రి యనమల రామకృష్ణుడు, ఎంపీ సుజనా చౌదరి నేతృత్వంలో రెండు కమిటీలు ఏర్పాటు చేశారు. వీరిద్దరు అసంతృప్తులను బుజ్జగించడంతో పాటు నామినేటెడ్ పదవులు, పార్టీలో ముఖ్య పదవుల పంపకంపై హామీ ఇవ్వనున్నారు. ఇతర పార్టీల నుంచి వలసలు పెరగడంతో కొన్ని జిల్లాల్లో పార్టీ నాయకులను సర్దుబాటు చేయడం అధినేతకు కష్టంగా మారింది. 


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa