ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్నికల గుర్తు కన్పించవద్దు: సీఈఓ రజత్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 10, 2019, 09:37 PM

ఎన్నికల గుర్తులు ఎక్కడ కన్పించటానికి వీలు లేదని సీఈఓ రజత్ కుమార్ అన్నారు. తెలంగాణలో ఏప్రిల్ 11న పోలింగ్ ఉంటుందన్నారు. రాష్ట్రంలో 17 పార్లమెంట్ సీట్లకు ఎన్నికలు జరగబోతున్నాయని, 18న నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. నామినేషన్ దాఖలకు 25న చివరి తేదీ కాగా 26న పరిశీలిస్తారు. 28న ఉపసంహరణ కాగా ఏప్రిల్ 11న పోలింగ్ జరుగుతుందన్నారు. నామినేషన్ వేసేందుకు వెళ్లే వారి కోసం మూడు వాహనాలే అనుమతి ఉంటుంది. రాష్ట్రంలో 2కోట్ల 95 ,18,964 మంది ఓటర్లు ఉన్నారు. 34 వేల 603 పోలింగ్ స్టేషన్ లు ఉన్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో 24 గంటల్లో, ప్రైవేట్ కార్యాలయాల్లో ఉన్న అనధికారిక వ్యక్తులు 72 గంటల్లో ఖాళీ చేయాలి. బ్యానర్లు, ప్రచార ప్రకటనలు గోడలపై బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదు. ఎక్కడ కూడా పార్టీ వ్యక్తుల ఫోటోలు ఉండకూడదు. కేంద్ర ప్రభుత్వ ప్రకటనల్లో ప్రధాని , మంత్రులు, రాజకీయ నాయకుల ఫోటోలు తీసేయాలి. ఎలాంటి అధికారిక వాహనాలు మంత్రులు ఉపయోగించకూడదన్నారు.
ఈవీఎం లు, వీవీ ఫ్యాట్స్ ఎన్నికల నాటికి సిద్ధంగా ఉంటాయన్నారు. ఒక్క బూత్ లో అర్బన్ లో1400 మంది ఓటర్లు, రూరల్ లో1200 మంది ఓటర్స్ ఉంటారుర. ఓటరు గుర్తింపు కార్డ్ తప్పనిసరి అని, లేని వారికి మిగతా ప్రభుత్వ గుర్తింపు కార్డులు తీసుకెళ్ళొచ్చు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa