ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సామాజిక మాధ్యమాలకూ నియమావళి వర్తింపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 11, 2019, 06:34 PM

ఎన్నికల ప్రచారంలో సామాజిక మాధ్యమాలు కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాలకు కూడా  ఎన్నికల నియమావళి వర్తిస్తుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. అభ్యర్థులు వారి సోషల్‌ మీడియా ఖాతాలకు సంబంధించిన వివరాలను ఎన్నికల నామపత్రాలతో పాటు జతచేయాల్సి ఉంటుంది. సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రకటనలకు సైతం ధ్రువీకరణ తప్పనిసరి అని ఈసీ స్ఫష్టం చేసింది. గూగుల్‌,  ఫేస్‌బుక్‌, ట్విటర్‌, యూట్యూబ్‌ లాంటి సంస్థలన్నీ రాజకీయ పార్టీల ప్రకటనలను క్షణ్ణంగా పరిశీలించాలని కోరింది. దీనిపై పర్యవేక్షణ కోసం ఒక ప్రత్యేక అధికారిని కూడా నియమిస్తున్నట్లు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కోసం వెచ్చిస్తున్న సొమ్మును కూడా ఎన్నికల ఖర్చుగా చూపాల్సిందేనని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. విద్వేషపూరిత సందేశాలకు తావివ్వకూడదని సోషల్‌ మీడియా సంస్థలను ఆదేశించామన్నారు. ఎవరైనా ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు పాల్పడితే సీ-విజిల్‌ యాప్‌ ద్వారా ఎన్నికల సంఘం దృష్టి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa