ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలని మన్యం జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్. శోభిక జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) కార్యక్రమం జేసీ అధ్యక్షతన సోమవారం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఐటీడిఏ పిఓ అశుతోష్ శ్రీవాస్తవ, ఆర్డీఓ కె. హేమలత, కేఆర్ఆర్సీ ప్రత్యేక ఉప కలెక్టర్ లతో కలిసి 98 మంది అర్జీదారుల నుంచి జేసీ వినతులను స్వీకరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa