ఒకవైపు ఏపీకి తీరని అన్యాయం జరుగుతుంటే.. మరోవైపు ఏ ఒక్క అంశంపైనా టీడీపీ ఎంపీలు నోరు విప్పడం లేదని వైయస్ఆర్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. అయితే.. రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు వైయస్ఆర్‌సీపీ పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారాయన. ఫైనాన్స్ బిల్లుపై చర్చ సందర్భంగా సోమవారం వైయస్ఆర్‌సీపీ తరఫున ఆయన చర్చలో పాల్గొన్నారు. పోలవరం అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తే దమ్ము టీడీపీ ఎంపీలకు లేదు. ప్రాజెక్టు ఎత్తుపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. పోలవరం ఎత్తును 45 . 72 నుంచి 41.15 తగ్గించడం అన్యాయం. దాదాపు 194 టీఎంసీల కెపాసిటీతో దీనిని డిజైన్ చేశారు. కానీ, ఎత్తు తగ్గించడం వల్ల స్టోరేజ్ కెపాసిటీ 115 టీఎంసీలకు పడిపోతుంది. అలాగే.. రూ.60 వేల కోట్ల వ్యయం అవుతుండగా కేవలం 30 వేల కోట్ల రూపాయలకి కేంద్ర ప్రభుత్వం పరిమితం అవుతోంది. పార్లమెంటులో ఇచ్చిన హామీని కేంద్రం నిలబెట్టుకోకపోవడం అన్యాయం అని అన్నారు.
![]() |
![]() |