శ్రీసత్యసాయి జిల్లా, కదిరిలో వైయస్ఆర్‌సీపీ నేతలపై టీడీపీ నేతలు కక్ష సాధింపు చర్యలకు దిగారు అని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా, కదిరి నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ సమన్వయకర్త మక్బూల్ పై చామలగొంది ఎంపీటీసీ లక్ష్మీదేవిని కిడ్నాప్ చేశారంటూ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని ఇప్పటికే ఎంపీటీసీ లక్ష్మీదేవి ఓ సెల్ఫీ విడియో విడుదల చేశారు. ఎంపీటీసీ లక్ష్మీదేవి దూరపు బంధువు నుంచి ఫిర్యాదు తీసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 27న గాండ్లపెంట ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో టీడీపీ కుట్రలకు తెరతీసింది.అలానే అనంతపురం జిల్లా గుత్తిలో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. వైయస్ఆర్‌సీపీ మాజీ ఎంపీ కోన మురళీధర్‌రెడ్డి ఇంటిపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఇంటి అద్ధాలు, వాహనాలను టీడీపీ గూండాలు ధ్వంసం చేశారు అని వాపోయారు.
![]() |
![]() |