పదేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఏడేళ్ల చిన్నారి హత్య కేసులో బుధవారం అనకాపల్లి జిల్లా చోడవరం కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ఈ కేసులో నిందితుడు శుభాచారి శేఖర్(31)కు న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. దేవరాపల్లికి చెందిన శేఖర్‌కు మరణశిక్ష విధిస్తూ 9వ అదనపు జిల్లా జడ్జి కె.రత్నకుమార్ ఈ మేరకు తీర్పునిచ్చారు. 2015లో ఏడేళ్ల బాలికను బీరు సీసాతో నిందితుడు గొంతుకోసి హత్య చేశాడు. సుదీర్ఘ విచారణ అనంతరం అతనిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఉరిశిక్ష విధించారు. చోడవరం కోర్టు చరిత్రలో మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించడం ఇదే మొదటిసారి.
![]() |
![]() |