ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ-కేవైసీ పూర్తయ్యాక కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్న మంత్రి నాదెండ్ల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 01, 2025, 07:37 PM

రేషన్ కార్డులపై ఏపీలోని కూటమి ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇకపై రేషన్ కార్డులు ఏటీఎం కార్డు సైజులోనే వస్తాయని రాష్ట్ర ఆహారం, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. మే నెల నుంచి ఈ కొత్త రకం రేషన్ కార్డులు జారీ చేస్తామని చెప్పారు. ఈ-కేవైసీ పూర్తయ్యాక కొత్త రేషన్ కార్డులు జారీ ఉంటుందని తెలిపారు. ఇందులో కుటుంబ సభ్యుల జోడింపు, తొలగింపు, స్ప్లిట్ కార్డులకు ఆప్షన్లు ఉంటాయని మంత్రి నాదెండ్ల వివరించారు. క్యూఆర్ కోడ్, ఇతర సెక్యూరిటీ ఫీచర్లతో ఈ కొత్త తరహా రేషన్ కార్డులు రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. ఈ-కేవైసీ పూర్తయ్యాక ఎంతమందికి కార్డులు ఇవ్వాలో స్పష్టత వస్తుందని అన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com