చిన్న జబ్బు వచ్చి ఆసుపత్రికి వెళ్లినా డాక్టర్లు రకరకాల టెస్టులు రాస్తూ టెన్షన్ పెట్టేస్తుంటారు. ఇదే అంశంపై ఏపీ వైద్య మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రోగులను వైద్యులు మానవతా దృష్టితో చూడాలని అన్నారు. అవసరం లేకపోయినా స్కానింగ్ లు, ఎక్స్ రేలు రాస్తున్నారని విమర్శించారు. సాధారణ ప్రసవాలు చేయకుండా సిజేరియన్ లు చేస్తున్నారని అన్నారు. ప్రజలు కూడా అలాగే ఉన్నారని ఎక్కువ టెస్టులు రాస్తేనే వైద్యులు బాగా చేశారనే అపోహలో ఉంటున్నారని చెప్పారు.ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్య మంత్రి చెప్పారు. రోగులను వైద్యులు చిరునవ్వుతో పలకరించాలని అన్నారు. ఎన్టీఆర్ యూనివర్సిటీలో ఏపీ మెడికల్ కౌన్సిల్ నూతన సభ్యుల ప్రమాణస్వీకారం ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమానికి సత్యకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు
![]() |
![]() |