ధర్మవరం మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కు గురువారం సీఐటీయూ నాయకులు వినతి పత్రం ఇచ్చారు. ఆప్కాస్ పద్ధతి రద్దు చేసి, కాంట్రాక్ట్ విధానం అమలు చేయాలనే ఆలోచనలు విరమించుకోవాలని అన్నారు.
అలా కాని పక్షంలో కార్మికులను రెగ్యులర్ చేయాలని కోరుతూ, చలో విజయవాడ కార్యక్రమానికి సంబంధించి పారిశుద్ధ్య కార్మికులకు అనుమతి ఇవ్వాలని కోరామని అన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు తమ పోరాటం కొనసాగిస్తామన్నారు.
![]() |
![]() |