రానున్న ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే పశ్చిమ నిమోజకవర్గ ప్రజల ఆకాంక్షల మేరకు పాలన సాగిస్తానని కోరాడ ఫౌండేషన్ ఛైర్మన్ కోరాడ విజయ్‌కుమార్ అన్నారు. ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ బీసీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన ఆయన రోజువారీ పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం 27వ డివిజన్‌లోని స్థానిక యువకులు మెండు అశోక్, బ్రహ్మ యాదవ్ ఆధ్వర్యంలో డివిజన్‌లోని ఆర్టీసీ వర్క్‌షాప్ రోడ్డు, సంజయ్‌గాంధీ కాలనీ, మానవ మందిర్ ఆశ్రమం రోడ్డు, తదితర ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరుగుతూ ఎన్నికల్లో తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రధానంగా స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కోరాడ విజయ్‌కుమార్ మాట్లాడుతూ పశ్చిమం నుండి గతంలో ఎంతోమంది పేరున్న నేతలు శాసనసభ్యులుగా ఎన్నికైనప్పటికీ నియోజకవర్గం ఎందుకు అభివృద్ధి చెందలేదో ప్రశ్నించుకోవాలని ప్రజలకు సూచించినట్లు తెలిపారు. అభివృద్ధి జరగనప్పుడు స్థానిక శాసనసభ్యుడిని ప్రశ్నించే తత్వం ప్రజల్లో రావాల్సిన అవసరం ఉందని అప్పుడే అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. తాను ఈ ప్రాంత వాసుడిని కావడం వల్లే కోరాడ ఫౌండేషన్ స్థాపించి సామాజిక బాధ్యతగా పేద ప్రజలకు సేవలందిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో తనను గెలిపించి ప్రజలు అధికారం ఇస్తే నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి చూపుతానని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు బాడిత శంకర్, పోతిన బేసుకంటేశ్వరుడు, కోరాడ అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa