ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లోకేష్ పోటీ చేయబోతున్న మంగళగిరి నియోజకవర్గ ట్రాక్ రికార్డ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 13, 2019, 09:07 PM

గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి   టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా మంత్రి నారా లోకేష్   పోటీ  ఖాయం కావ‌టంతో అంద‌రి దృష్టి ఈ నియోజ‌క‌వ‌ర్గంపై పడింది.ఇప్పుడు గ‌తంలో గెలుపు ఓట‌ముల‌పై  ఈ నియోజకవర్గ ట్రాక్ రికార్డ్‌పై రాజకీయ వర్గాల్లో తీవ్ర చ‌ర్చ జ‌రుగుతోంది. ఇక‌ మంగళగిరి నియోజకవర్గం విష‌యానికి వ‌స్తే 1962లో ఏర్ప‌డిన ఈ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్‌దే హ‌వా.  ఎన్టీఆర్ గాలిలోనూ కాంగ్రెస్ ద‌క్కించుకుంది. అయితే  1985లో  టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు  కాంగ్రెస్ అభ్యర్థి జమునపై గెలుపొంది సంచ‌ల‌నం సృష్టించారు. అయితే త‌ద‌నంత‌ర పొత్తులో భాగంగా మిత్ర‌ప‌క్షాల‌కు ఈ సీటును టిడిపి కేటాయిస్తూ వ‌చ్చింది.   2004లో పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థి ఇక్కడ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014లో గంజి చిరంజీవి మంగళగిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి 12ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు.  రాజధాని ఏర్పాటు తర్వాత మంగళగిరి నియోజకవర్గం సీఆర్డీఏ పరిధిలోకి రావడం, పలు అభివృద్ధి పనులు జరగడంతో లోకేష్ గెలుపు ఖాయమనే ధీమాలో టీడీపీ శ్రేణులు ఉన్నాయి.
ఇక అత్యధికంగా బీసీ ఓటర్లు ఉన్న ఈమంగళగిరి  నియోజకవర్గం లో మొత్తం ఓటర్ల సంఖ్య 2,39,536 కాగా. వీరిలో ఎస్సీ ఓటర్లు 50వేల మందికి పైగా ఉన్నారు. అలాగే తరువాతి స్థానంలో యాదవ, పద్మశాలీ, గౌడ్, కమ్మ, కాపు సామాజిక వర్గాల ఓటర్లు  ఉన్నారు. ఈ నియోజకవర్గంలో గెలుపోటములు బీసీ ఓటర్ల తీర్పు పైనే ఆధారపడి ఉంటాయనడంలో సందేహం లేదు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa