ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన.. అంగన్వాడీల్లో చిన్నారులకు శుద్ధజలం

national |  Suryaa Desk  | Published : Wed, Apr 30, 2025, 05:28 PM

దేశవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పరిశుభ్రమైన తాగునీరు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఈ మేరకు అంగన్వాడీ కేంద్రాల్లో నీటి శుద్ధి యంత్రాల ఏర్పాటుతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కొత్త పథకానికి శ్రీకారం చుట్టినట్లు సమాచారం.
ఈ పథకం కింద అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు, నీటి సౌకర్యం, మరుగుదొడ్లు, విశాలమైన ప్రాంతం, విద్యుత్ సరఫరా, ఇంకుడు గుంతల ఏర్పాటును ప్రభుత్వం చేపట్టనుంది. ఈ సౌకర్యాలు అంగన్వాడీల్లో సేవలు పొందే చిన్నారులు మరియు మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.
త్వరలోనే ఈ పథకంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి. ఈ చర్య దేశవ్యాప్తంగా అంగన్వాడీల సమగ్రాభివృద్ధికి దోహదపడనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa