విశాఖపట్నంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతి దారుణ హత్యకు గురైంది. హత్య అనంతరం దుండగులు ఆమెపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఈ దారుణ ఘటన భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని దాకమర్రి ఫార్చ్యూన్ లే అవుట్ సమీపంలో జరిగింది.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సంఘటనను పరిశీలించారు. ఈ హత్య వెనుక గల కారణాలు, దుండగుల వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటన విశాఖ నగరంలో కలకలం రేపింది. యువతి గుర్తింపు, హత్యకు గల కారణాలపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa