ఆంధ్రప్రదేశ్‌లో కక్ష రాజకీయాలు తార స్థాయికి చేరాయని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. ‘‘ఐఏఎస్‌లను, ఐపీఎస్‌లను ఇప్పటికే టార్గెట్‌చేసి వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇప్పుడు మాజీ ఐఏఎస్, మాజీ ప్రభుత్వాధికారులపైనా చంద్రబాబు కక్ష రాజకీయం చేస్తున్నారు. ఈ పరిణామాలు ఆంధ్రప్రదేశ్‌కు మంచివి కావు. చంద్రబాబు కక్ష రాజకీయాలు రాష్ట్రాన్ని, ప్రజలను దెబ్బతీస్తాయి. పరిపాలనలో చంద్రబాబు ఘోరంగా విఫలం కావడంవల్లే ప్రజల దృష్టిని మళ్లించేందుకు తప్పుడు రాజకీయాలు చేస్తున్నారు. వాగ్దానాల అమలు లేదు, ఏ వర్గంకూడా సంతోషంగా లేరు. రాష్ట్రంలో ఎవ్వరికీ భద్రతలేదన్న సంకేతాన్ని చంద్రబాబు ఇస్తున్నారు. మాజీ ఐఏఎస్ ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. తప్పుడు రాజకీయాలు మాని, రాష్ట్రంపై చంద్రబాబు దృష్టిపెట్టాలి. అణచివేసినంత మాత్రాన ప్రభుత్వంపై వ్యతిరేకత సద్దుమణగదు’’ అని శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa