అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల పెంపు నిర్ణయాలతో మరోసారి చర్చనీయాంశమయ్యారు. ఈసారి ప్రవాసీయులు తమ స్వదేశాలకు పంపే నగదు బదిలీలపై 5 శాతం పన్ను విధించే ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. ఈ బిల్లు త్వరలో అమెరికా ప్రతినిధుల సభలో చర్చకు రానుంది.
ఒకవేళ ఈ చట్టం అమలులోకి వస్తే, హెచ్-1బీ వీసా హోల్డర్లు, గ్రీన్ కార్డ్ దారులతో సహా అమెరికాలో నివసిస్తున్న లక్షలాది భారతీయులపై ఆర్థిక భారం పడనుంది. ఈ పన్ను వల్ల విదేశాలకు డబ్బు పంపే ప్రక్రియ ఖరీదైనదిగా మారి, ప్రవాసీయుల ఆదాయంలో గణనీయమైన భాగం పన్ను రూపంలో కోల్పోయే అవకాశం ఉంది.
ఈ నిర్ణయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా అమెరికాతో ఆర్థిక సంబంధాలు గల దేశాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఇప్పుడు కీలక చర్చాంశంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa