దేశ భద్రత కోసం ఉద్దేశించిన ఈవోఎస్-09 (రీశాట్-1బీ) ఉపగ్రహాన్ని పీఎ్‌సఎల్వీ-సీ 61 రాకెట్ నేడు నింగిలోకి మోసుకెళ్లనుంది. తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట షార్ అంతరిక్ష కేంద్రం నుంచి ఆదివారం ఉదయం 5.59 గంటలకు ఈ ప్రయోగం జరగనుంది. శనివారం ఉదయం 7.59 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించారు. 22 గంటల పాటు ఈ కౌంట్‌డౌన్ కొనసాగుతుంది. ఒకటో ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్వీ-సీ 61 రాకెట్ అంతరిక్షంలోకి దూసుకెళ్లనుంది. కాగా, రాకెట్‌లో ధ్రవ ఇంధనం, హీలియం, నైట్రోజన్ గ్యాస్‌ను నింపే కార్యక్రమాన్ని శాస్త్రవేత్తలు పూర్తిచేశారు. దేశ భద్రత, సైనిక అవసరాల కోసం రీశాట్-1బీ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు. ఇప్పటికే కార్టోశాట్-1 ఉపగ్రహం లోయర్ ఎర్త్ ఆర్బిట్‌లో తిరుగుతూ చిత్రాలు అందిస్తోంది. అయితే అది రాత్రివేళల్లో ప్రతికూల వాతావరణంలో ఉపయోగపడటం లేదు. తాజాగా పీఎ్‌సఎల్వీ-సీ 61 రాకెట్ ద్వారా ప్రయోగించే ఈవోఎస్-09 ఉపగ్రహంలో అమర్చిన సీ-బ్యాండ్ సింథటిక్స్ ఎపర్చర్ రాడార్ ద్వారా ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా అధిక రెజల్యూషన్‌తో కూడిన భూ ఉపరితల చిత్రాలు లభిస్తాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa