సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఓబీసీ దివ్యాంగుల కోటా కింద తప్పుడు ధృవపత్రాలు సమర్పించి ప్రయోజనం పొందారన్న తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఐఏఎస్ ప్రొబేషనరీ అధికారిణి పూజా ఖేడ్కర్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమె దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం బుధవారం అనుమతించింది. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆమె బెయిల్‌ను తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ, కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది.జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. "ఆమె చేసిన ఘోరమైన నేరం ఏమిటి ఆమె ఏమైనా హత్య చేసిందా ఆమె డ్రగ్ లార్డ్ కాదు, ఉగ్రవాది కాదు. సెక్షన్ 302 కింద నేరం చేయలేదు. ఎన్డీపీఎస్ చట్టం కింద కూడా నిందితురాలు కాదు. మీ దగ్గర యూపీఎస్సీ వద్ద ఒక వ్యవస్థ లేదా సాఫ్ట్‌వేర్ ఉండాలి. మీరు దర్యాప్తు పూర్తి చేయండి. ఆమె ఇప్పటికే సర్వం కోల్పోయింది, ఇకపై ఎక్కడా ఉద్యోగం కూడా రాదు" అని ధర్మాసనం .పూజా ఖేడ్కర్ కమిషన్‌ను, ప్రజలను మోసం చేశారని ఆరోపిస్తూ ఢిల్లీ పోలీసులు, యూపీఎస్సీ ఆమె ముందస్తు బెయిల్‌ను తీవ్రంగా వ్యతిరేకించాయి. అంతకుముందు, ఢిల్లీ హైకోర్టు కూడా ఆమె ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది, మధ్యంతర రక్షణను తొలగించింది. యూపీఎస్సీ ఇప్పటికే ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేయడమే కాకుండా, భవిష్యత్తులో ఎలాంటి పరీక్షలు రాయకుండా నిషేధించింది. ఐఏఎస్ రూల్స్, 1954లోని రూల్ 12 ప్రకారం కేంద్ర ప్రభుత్వం కూడా ఆమెను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ నుంచి అధికారికంగా తొలగించింది.పూజా ఖేడ్కర్ పలు తప్పుడు ధ్రువపత్రాలను యూపీఎస్సీకి సమర్పించి అత్యంత పోటీ ఉండే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారని ఆరోపణలు ఉన్నాయి. ఓబీసీ నాన్-క్రిమీలేయర్ వర్గానికి చెందినట్లు, అలాగే మానసిక అనారోగ్యం, తక్కువ దృష్టి, లోకోమోటర్ సమస్యలతో సహా వివిధ వైకల్యాలు ఉన్నట్లు పలు సర్టిఫికెట్లను ఉపయోగించినట్లు సమాచారం. అంతేకాకుండా, దరఖాస్తు ప్రక్రియలో ఖేడ్కర్ పూజా దీలీప్రావ్, పూజా మనోరమ దిలీప్ ఖేడ్కర్ వంటి వేర్వేరు పేర్లను ఉపయోగించడం, ఆమె ఎన్నిసార్లు పరీక్ష రాశారనే దానిపై సందేహాలకు తావిచ్చింది. గరిష్ట పరీక్ష ప్రయత్నాల నిబంధనను దాటవేయడానికే ఆమె పేరు మార్పును ఉపయోగించారనేది మరో ప్రధాన ఆరోపణ.గతంలో పూణెలో ఆమె పోస్టింగ్ వివాదాస్పదం కావడం, అధికార దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఆమెను వాషింకు బదిలీ చేయడంతో పూజా ఖేడ్కర్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఓబీసీ నాన్-క్రిమీలేయర్ కేటగిరీకి చెందినదన్న ఆమె వాదనలపై దర్యాప్తు చేయాలని రాష్ట్ర ఓబీసీ సంక్షేమ శాఖ మంత్రి ఆదేశించడంతో ఆమె చిక్కులు మరింత తీవ్రమయ్యాయి. ఐఏఎస్ ఎంపికకు ముందు, ఆమె ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారిణిగా పనిచేస్తూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పోస్టింగ్‌లో ఉన్నారు. ఐఆర్ఎస్ పోస్టు కోసం ఓబీసీ, పీడబ్ల్యూడీ కేటగిరీలను ఉపయోగించిన ఆమె, ఐఏఎస్ కోసం పీడబ్ల్యూడీ కొత్త ఓబీసీ సర్టిఫికెట్‌ను ఉపయోగించినట్లు ఆరోపణలున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa